telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

7360 కోట్ల రైతుబంధు జమ…

తెలంగాణలో ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన రైతులు తమ ఖాతాల వివరాలు సమర్పించనట్లయితే స్థానిక ఏఈవోలను సంప్రదించాలని సూచించారు.. ఖాతాలు సమర్పించిన రైతులకు వారి వారి ఖాతాలలో నిధులు జమ చేయబడ్డాయని.. రైతుబంధు నిధులను బ్యాంకర్లు పాతబస్తీల కింద జమ చేసుకోవద్దని స్పష్టం చేసింది సర్కార్.. ఒకవేళ బ్యాంకులు ఇప్పటికే జమ చేసుకుంటే.. ఆ సొమ్మును తిరిగి రైతులకు అందజేయాలని ఆదేశిచింది.. ఇదివరకే వ్యవసాయ శాఖ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీని రైతుబంధు నిధులు బ్యాంకులు జమ చేసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరడం జరిగిన విషయం తెలిసిందే.. ఈ రోజు వరకు రైతుబంధుకు అర్హులయిన రైతుల బ్యాంకు ఖాతా వివరాల ప్రకారం అందరికీ నిధులు వారి ఖాతాలలో జమచేయడం జరుగుంది అని పేర్కొంది.

Related posts