telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

దేశంలో 70 లక్షలు దాటిన కరోనా కేసులు…

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే ఈ వైరస్‌ ప్రపంచ నలుమూలల పాకింది. ఇక మన దేశం విషయానికి వస్తే…భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది.. రోజువారి కేసుల సంఖ్య కాస్త తగ్గినా.. కేసుల సంఖ్య ఇంకా భారీగానేఉంది… తాజా కేసులతో కలుపుకొని 70 లక్షల మార్క్‌ను కూడా క్రాస్‌ చేశాయి పాజిటివ్ కేసులు.. కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్‌ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 74,383 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి.

918 మంది మృతిచెందారు.. దీంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 70,53,807కు చేరుకోగా.. ఇప్పటి వరకు 60,77,977 మంది కరోనాబారినపడి కోలుకున్నారు. ప్రస్తుతం దేశ్యాప్తంగా 8,67,496 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 1,08,334 మంది మృతిచెందినట్టు తన బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. కరోనా రోగుల రికవరీ రేటు 86.17 శాతానికి పెరగగా.. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.30 శాతంగా ఉన్నాయి.. ఇక, మరణాల రేటు 1.54 శాతానికి తగ్గినట్టు కేంద్రం పేర్కొంది. మరోవైపు.. శనివారం ఒకే రోజు దేశంలో 10,78,544 కరోనా శాంపిల్స్ టెస్ట్ చేశామని.. దీంతో.. ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 8,68,77,242 చేరినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. 

Related posts