నటరత్న ఎన్.టి.రామారావు గారు నటించిన సాంఘిక చిత్రం డి.వి.యస్ ప్రొడక్షన్స్ “ధనమా? దైవమా? ” 24-05-1973 విడుదలయ్యింది.
నిర్మాత డి.వి.ఎస్.రాజు గారు డి.వి.యస్ ప్రొడక్షన్స్ పతాకంపై ప్రముఖ దర్శకుడు సి.యస్.రావు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రాన్నికి రచన, మాటలు: మోదుకూరిజాన్సన్, సముద్రాల, పాటలు: సి. నారాయణరెడ్డి, ఫోటోగ్రఫీ: జి.కె.రాము, సంగీతం టి.వి.రాజు., కళ: కళాధర్, నృత్యం: చిన్నీ- సంపత్, ఎడిటింగ్: బి.గోపాలరావు, అందించారు.
ఈచిత్రంలో ఎన్.టి.రామారావు, జమున, చంద్రమోహన్ సత్యనారాయణ, , వరలక్ష్మి, ముక్కామల, వెన్నిరాడై నిర్మల, పద్మనాభం, అల్లు రామలింగయ్య, సాక్షిరంగారావు, జగ్గారావు, జి.నాగరత్నం, విజయ భాను తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు టి.వి. రాజు గారి సంగీత సారధ్యంలో కూర్చిన పాటలు హిట్ అయ్యాయి.
ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారికి గాయకుడు రామకృష్ణ పాటలు పాడారు.
‘రామా, శ్రీరామా, జయ జయ రామా”
“నీ మది చల్లగా స్వామి నిదురపో
దేవుని నీడలో వేదన మరచిపో”
“రారా నవ మోహనా ఇటు రారా నవమోహనా”
“కన్నుమూసినా కన్ను తెరిచినా”
“హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్”
వంటి పాటలు ప్రేక్షకులను అలరించాయి.
ఎన్టీఆర్ గారి పలు చిత్రాలకు సంగీతాన్ని అందించిన సంగీత దర్శకుడు టి.వి. రాజు గారు ఈ సినిమా విడుదలకు ముందే మృతి చెందారు.
ఆయన సంగీతం అందించిన చివరి చిత్రం “ధనమా? దైవమా?”
ఎన్టీఆర్ గారు చంద్రమోహన్ కలిసి నటించిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ చిత్రం లో ఎన్టీఆర్ గారి తమ్ముడు గా చంద్రమోహన్ నటించారు.
ఈ చిత్రం యావరేజ్ విజయాన్ని అందుకుని
పలుకేంద్రాలలో 50 రోజులు పైగా ప్రదర్శింపబడి,
అర్ధశతదినోత్సవాలు జరుపుకున్నది…

