అల్పాహారం రోజులో అత్యంత ముఖ్యమైనది. అయితే బిజీ షెడ్యూల్ల మధ్య, లు , ఆఫీస్ డైలీ బ్రేక్ ఫాస్ట్ ని నిర్లక్ష్యం చేస్తుంటాము. మనిషికి అల్పాహారం తీసుకోవడం చాలా ముఖ్యం, కానీ మంచి అల్పాహారం తినడానికి కూడా ప్రయత్నించాలి.
ఉదయాన్నే కొన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్‌ను టిఫిన్‌గా తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మనలో చాలా మంది ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ గా ఏది కనిపిస్తే అది తినేస్తుంటారు. మన రెగ్యులర్ ఫుడ్‌లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ ఉండే టట్లు చూసుకోవాలి.
అయితే ఈ కింది ఫుడ్ ఐటెమ్స్ ను టిఫిన్ గా తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫుడ్ ఐటెమ్స్ ఏంటో తెలుసుకోండి.
![]()
1. కేకులను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. ఈ పదార్థాలన్నీ శరీరానికి చాలా హానికరం. అల్పాహారం కోసం రొట్టె, కూర లేదా పండ్లను తినడం ఆరోగ్యానికి మేలు
2. ఉదయాన్నే ప్రాసెస్ చేసిన తినడం వల్ల మీ శరీరంలో కొవ్వు పెరుగుతుంది. దీంతో గుండె సమస్యలు ఎదుర్కొవలసి వస్తుంది.

3. నూడుల్స్ తినడానికి చాలా రుచికరరంగా ఉన్నప్పటికీ అల్పాహారంగా దీనిని అస్సలు తినొద్దు.
4. ఉదయాన్నే జ్యూస్ అల్పాహారంగా తీసుకొంటే మంచిది అని అందరూ అనుకుంటారు కానీ జ్యూస్‌లో ఎక్కువగా చక్కెర ఉంటుంది. ఇది మీ బరువును పెంచుతుంది.

5. ఉదయం నూనెలో వేయించిన వాటిని బ్రేక్ ఫాస్ట్ గా తినకుండా ఉండడం చాలా మంచిది. సమోశ, వడలు, పూరి, పరోటా లాంటి పదార్థాల బదులుగా ఉదయాన్నే బ్రెడ్, వోట్స్, పండ్లు తినండి.


