నందమూరి తారకరామారావు గారు శ్రీరాముడు గా నటించిన మరొక పౌరాణిక చిత్రం శ్రీ లక్ష్మీనారాయణ ఫిలింస్ వారి “శ్రీ రామాంజనేయ యుధ్ధం” 10-01-1975 విడుదల. నిర్మాతలు పొట్లూరి వెంకట నారాయణ, ఎన్.బి.కె. ఉమామహేశ్వరరావు లు శ్రీ లక్ష్మీనారాయణ ఫిలింస్ పతాకంపై ప్రముఖ దర్శకులు బాపు గారి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఈ చిత్రానికి కథ,మాటలు, పద్యాలు: గబ్బిట వెంకట్రావు, పాటలు: ఆరుద్ర, దాశరధి, కోసరాజు, సి.నారాయణరెడ్డి, గబ్బిట వెంకట్రావు, సంగీతం: కె.వి.మహదేవన్, ఫోటోగ్రఫీ: కె.ఎస్.ప్రసాద్, నృత్యం: బి.హీరాలాల్, కళ:ఏ. కె.శేఖర్, కూర్పు: బి.హరినారాయణ అందించారు. ఈ చిత్రంలోఎన్.టి. రామారావు, బి.సరోజాదేవి, ఆర్జా జనార్ధనరావు, రాజశ్రీ, కాంతారావు, జయంతి, ముక్కామల, ధూళిపాళ తదితరులు నటించారు.
ప్రముఖ సంగీత దర్శకులు కె.వి.మహదేవన్ గారి సంగీత సారధ్యంలో వెలువడిన పాటలు, పద్యాలు
“మేలుకో శ్రీరామా మేలుకో రఘురామా”
“జయతు జయతు మంత్రం శరణు శరణయా జానకిరామా”
“భీకరమౌ శ్రీరామ బాణం”
“సాకేత సార్వభౌమా”
లాంటి పసందైన పాటలు మరియు రఘురామయ్య గారి పాటలు, పద్యాలు శ్రోతలను అలరించాయి.
“శక్తి గొప్పదా-భక్తి గొప్పదా” అనే అంశం పై సృష్టింపబడిన అపూర్వ కళాఖండం. ఈ చిత్రం విజయం సాధించి పలు కేంద్రాలలో 50 రోజులు ప్రదర్శింపబడి, మూడు కేంద్రాలలో(1 డైరెక్ట్ + 2 షిఫ్ట్) 100 రోజులు ప్రదర్శింపబడింది.
100 రోజులు ప్రదర్శింపబడిన కేంద్రాలు:—
1.తిరుపతి — ఐ.ఎస్. మహల్ (డైరక్ట్) 100 రోజులు,
2. విజయవాడ — శ్రీలక్ష్మి టాకీస్ (69 రోజులు) + శ్రీనివాస మహల్ (31 రోజులు) – 100 రోజులు.
3. హైదరాబాద్ – బసంత్ (50రోజులు) + షిఫ్ట్ తో విజయలక్ష్మి(100వ రోజు)..
తెలుగునాట బహుళ ప్రజాదరణ లో ఉన్న రామాంజనేయ యుద్ధం నాటకాన్ని దృష్టిలో ఉంచుకుని అందులోని పద్యాలను ఇతివృత్తాన్ని తీసుకుని దర్శకుడు బాపు గారు ఈ చిత్రాన్ని కళా ఖండం గా తీర్చిదిద్దారు….


వైఎస్ జగన్ పులివెందుల పులిబిడ్డ: సినీనటి రమ్యశ్రీ