telugu navyamedia
సినిమా వార్తలు

సంక్రాంతి బరిలో ‘బంగార్రాజు’..

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం “బంగార్రాజు” .ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి, రమ్యకృష్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘సోగ్గాడే చిన్ని నాయన’ చిత్రానికి వస్తున్న ఈ చిత్రానికి కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వం వహిస్తున్నారు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న థియేటర్లలో సందడి చేయనుంది. దీంతో ప్ర‌మోష‌న్స్ జోరు పెంచారు చిత్రబృందం. అందులో భాగంగానే ఈ ఇప్పటికే ఈ సినిమాకి నుంచి విడుదలైన పోస్ట‌ర్స్‌, వీడియోలు, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Nagarjuna And Naga Chaitanya's 'Bangarraju' Teaser To Be Out Tomorrow

తాజాగా సినిమాలోని 4వ పాటగా “బంగార” అనే మాస్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. నాగ చైతన్య, కృతిశెట్టి జంటగా అనూప్ రూబెన్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ సాంగ్ కనువిందుగా ఉంది.

అన్నపూర్ణ స్టూడియోస్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం దాదాపు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతుంది.

Related posts