ఫేస్ బుక్ పరిచయం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. మహబూబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం శంకరాయపల్లి వద్ద ఓ బాలిక దారుణహత్యకు గురైంది. పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఫేస్ బుక్ స్నేహితుడే అతి కిరాతకంగా బండరాయితో కొట్టి చంపినట్టు సమాచారం. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని స్థానిక హౌసింగ్ బోర్డులో నివాసముండే రవిశంకర్ అనే ప్రభుత్వ ఉద్యోగి కుమార్తె హర్షిణి(15) పదో తరగతి చదువుతోంది. ఆమెకు ఫేస్‌బుక్‌లో రంగారెడ్డి జిల్లా కొహెడ గ్రామానికి చెందిన నవీన్‌రెడ్డి అనే కారు మెకానిక్ పరిచయం అయ్యాడు.
గత కొంతకాలంగా వీరిద్దరూ ఫేస్ బుక్ మెసేంజర్ సహాయంతో మాటలాడుతూ ఉండేవారు. నవీన్ రెడ్డి జడ్చర్లకు వచ్చి హర్షిణికి మాయమాటలు చెప్పి సమీపంలో శంకరాయపల్లి తండాలోని నిర్మానుష్య ప్రాంతానికి కారులో తీసుకెళ్ళి బండరాయితో కొట్టి చంపినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.