telugu navyamedia
International National pm modi రాజకీయ వార్తలు

భారత ప్రధాని అయ్యే పటిమ రాహుల్ గాంధీకి లేదు: ప్రముఖగాయని మేరీ మిల్బెన్

ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై అమెరికాకు చెందిన ప్రముఖ గాయని, నటి మేరీ మిల్బెన్ తీవ్రంగా స్పందించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మోదీ భయపడుతున్నారన్న రాహుల్ ఆరోపణలను ఆమె తోసిపుచ్చారు.

ప్రధాని మోదీ దేశ ప్రయోజనాల కోసం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనది భయం కాదని స్పష్టం చేశారు.

ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ ఆమె ఒక పోస్ట్ పెట్టారు. “రాహుల్ గాంధీ, మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రధాని మోదీకి ట్రంప్‌ అంటే భయం లేదు.

ఆయనకు దీర్ఘకాలిక ప్రణాళికలు, వ్యూహాత్మక దౌత్యనీతిపై పూర్తి అవగాహన ఉంది” అని మిల్బెన్ పేర్కొన్నారు.

ఒక దేశాధినేతగా ట్రంప్ ఎలాగైతే అమెరికా ప్రయోజనాలకు పెద్దపీట వేస్తారో, మోదీ కూడా భారత్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తారని, దానిని తాను అభినందిస్తున్నానని తెలిపారు.

“ఈ తరహా నాయకత్వం మీకు అర్థమవుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే భారత ప్రధాని అయ్యే పటిమ మీకు లేదు” అని ఆమె ఘాటుగా విమర్శించారు.

అంతకుముందు, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లను ఆపేస్తుందని ట్రంప్ చేసిన ఓ ప్రకటనపై రాహుల్ గాంధీ స్పందించారు. “ప్రధాని మోదీకి ట్రంప్‌ అంటే భయం” అంటూ ‘ఎక్స్‌’లో పోస్ట్ చేశారు.

Related posts