సీఎం జగన్ లేఖపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణ జరగాలి అని ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఏపి షా అన్నారు. ఆయన మాట్లాడుతూ… సీఎం లేఖలో రెండు ప్రధాన అంశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి రమణ కుమార్తెల భూ లావాదేవీలపై అంశం మొదటిది. భూ లావాదేవీల పై సీఎం ప్రస్తావించిన న్యాయమూర్తులతో కాకుండా వేరొకరితో తక్షణమే పారదర్శకంగా విచారణ జరగాలి. హైకోర్టు వ్యవహారాల్లో జస్టిస్ రమణ జోక్యం రెండోది. జస్టిస్ రమణ కూతర్లపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ఈ రెండు అంశాలను వేరు వేరుగా చూడాలి .
ఏపీ హైకోర్టు న్యాయమూర్తులలో కొందరి పేర్లను సీఎం ప్రస్తావించాలి. ఒక రాజ్యాంగ వ్యవస్థ మరో రాజ్యాంగ వ్యవస్థపై పబ్లిక్ గా ఆరోపణలు చేసింది. ఈ అంశాన్ని పబ్లిక్ గానే డీల్ చేయాలి. న్యాయ వ్యవస్థపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలి. ఇన్ హౌస్ కమిటీ లేదా సీజేఐ స్వయంగా విచారణ జరపాలి. న్యాయవ్యవస్థ ఈ అంశంలో మౌనంగా ఉండటం మంచిది కాదు అన్నారు. ఏపీ హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ అసాధారణం. ఇది వాస్తవాలను గమనించకుండా తల తిప్పుకోవడమే. సీఎం లేఖను ఖండించడం ద్వారా జరిగేదు ఏమీ లేదు. సుప్రీంకోర్టు ఈ విషయంలో ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి. జడ్జీలపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు జవాబుదారి కలిగిన యంత్రాంగమండలి రావాలి. న్యాయవ్యవస్థపై రోజురోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అత్యంత అవసరం అని అన్నారు.
నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసిన చంద్రబాబు: జగన్