telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి పర్యావరణశాఖ అనుమతి…

Telangana secretariate photo

దేశం అంత కరోనాతో పోరాడుతుంటే… అదే సమయంలో పాత సచివాలయాన్ని కూల్చివేసి.. అక్కడే కొత్త సచివాలయ నిర్మాణానికి పూనుకుంది తెలంగాణ ప్రభుత్వం… ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. ముందుకు సాగుతూ వస్తుంది.. ఇప్పుడు సచివాలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. నూతన సెక్రటేరియట్ నిర్మాణానికి కేంద్ర పర్యావరణశాఖ అనుమతిచ్చింది. పాత సచివాలయ కూల్చివేతను కొంత కాలం అడ్డుకున్న హైకోర్టు కూడా ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణానికి అనుమతిచ్చింది. ఇప్పుడు కేంద్ర పర్యావరణ శాఖ అనుమతులు మంజూరు చేసింది. ఇక, పాత సచివాలయాన్ని ఇప్పటికే కూల్చివేశారు.. కొత్త సచివాలయాన్ని రాష్ట్ర కీర్తిప్రతిష్టలు ప్రతిబింబించేలా అద్భుత రీతిలో నిర్మించాలని భావిస్తోంది ప్రభుత్వం… దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. కొత్త సెక్రటేరియేట్‌ డిజైన్లపై పలుమార్లు సమీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. అయితే, మరికొన్ని మార్పులు కూడా సీఎం సూచించినట్టు తెలుస్తోంది.. ప్రభుత్వం ఆమోదించిన డిజైన్‌లో భవనం ముందు స్థలంలో హెలిప్యాడ్, రెండు వైపులా లాన్లు, వాహనాల పార్కింగ్‌ స్థలంలో చిన్న పాటి మార్పులు చేసినట్టు సమాచారం.

Related posts