telugu navyamedia
సామాజిక

షడ్రుచుల సమ్మేళనం..ఉగాది పచ్చ‌డి కి ప్ర‌త్యేకత‌

హిందువులకు ఉగాది ముఖ్యమైన పర్వదినం. ఏటా చైత్ర మాసంలో పాడ్యమి నాడు వచ్చే ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాదితోనే హిందువుల పండగలు ప్రారంభమవుతాయి. పండుగ రోజు ఉదయాన్నే నిద్ర లేచి ఇళ్లు వాకిళ్లు శుభ్రపరుచుకుని ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు. తల స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో దినచర్య ఆరంభిస్తారు.

తెలుగు ప్రజలు ఉగాది రోజున ఉగాది పచ్చడిని తప్పని సరిగా చేసుకుంటారు. ఉగాది పచ్చడి తీపి, చేదుల కలయిక. షడ్రుచుల సమ్మేళనమే ఉగాది. పచ్చడి తయారీలో ఉపయోగించే అన్ని పదార్థాలు లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయి. పచ్చడి .. తీపి , పులుపుల కలయిక. ఈ ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనం. పచ్చి మామిడి, కొత్త చింతపండు, బెల్లం, వేప పువ్వుల వంటి తీపి పదార్థాలతో తయారు చేస్తారు.

బెల్లం , అరటిపండు: (తీపి) ఆనందం వేప పువ్వు: (చేదు) దుఃఖం, బాధ పచ్చి మిరపకాయలు ( కారం): వేడి,కోపం ఉప్పు (ఉప్పు): ఉత్సాహం, జీవిత సారం చింతపండు (పులుపు): నేర్పుగా ఉండాల్సిన పరిస్థితులు. వగరు (మామిడి): కొత్త సవాళ్లు.

Ugadi 2020: Traditional Ugadi Pachadi To Start Off New Year With All The Six Tastes

 

సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఈ ఉగాది పచ్చడికి ఆయుర్వేదంలో ప్రముఖ స్ధానం ఇచ్చారు.

ఉగాది పచ్చడిలో ‘వేపపువ్వు’ వేస్తారు. ఆయుర్వేద శాస్త్రంలో వేపకు చాలా చాలా ప్రాధాన్యత ఉంది. అందుకే వేపను ఆరోగ్య ప్రదాయినిగా చెబుతుంది మన ఆయుర్వేద శాస్త్రం. ఉగాది పచ్చడిలో వెనుక ఆరోగ్యాలను కలిగించే అంశాలు కూడా ఉన్నాయి.

వేపపూత, కొత్త బెల్లం, మామిడి పిందెలు, పచ్చిమిర్చి, ఉప్పు, చింతపండు తో తయారు చేసి ఉగాది పచ్చడి తినటం వల్ల వల్ల వాత, కఫ దోషాలు తొలగుతాయని ఆయుర్వేదం చెబుతుంది. ఈ పచ్చడిని సంవత్సరానికి ఒకమారు ఉగాది నాడు తింటే దీని ప్రభావం తిరిగి ఉగాది వచ్చేవరకు ఉంటుందని నమ్మకం.

Related posts