telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

సుశాంత్ కేసుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

sharad power ncp

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును సుప్రీంకోర్టు సీబీఐకి అప్పగించిన సంగతి తెలిసిందే. నేపథ్యంలో ఈ అంశం పూర్తిగా రాజకీయమలుపు తిరిగింది. సుప్రీం తీర్పుతో సుశాంత్ కుటుంబానికి న్యాయం జరుగుతుందనే నమ్మకం ఏర్పడిందని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మాట్లాడుతూ మహారాష్ట్ర ప్రభుత్వం కూలిపోవడానికి సమయం ఆసన్నమైందని కామెంట్ చేశారు.

ఈ నేపథ్యంలో మహా సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి, ఎన్సీపీ అధినేత అయిన శరద్ పవార్ స్పందించారు.సుశాంత్ కేసులో సీబీఐ విచారణను స్వాగతిస్తూనే శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ హేతువాది నరేంద్ర దబోల్కర్ కేసును 2014లో సీబీఐ ప్రారంభించినప్పటికీ ఇంతవరకు వరకు ఆ కేసు ముగియలేదని తెలిపారు. సుశాంత్ కేసు కూడా అపరిష్కృతంగానే మిగిలి పోతుందని తాను భావించడం లేదన్నారు. కేసు విచారణలో సీబీఐకి తమ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు.

Related posts