telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

జుట్టు రాలకుండా ఒత్తుగా.. పెరగాలంటే.. ఇలా !

tips for healthy hair and reduce hair fall

ఒత్తిడితో కూడిన నేటి జీవన శైలి కారణంగా వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య అధికం అవుతుంది. మగవారు బట్ట తల వస్తుందని కంగారు పడితే, ఆడవారు మాత్రం తమ అందం ఎక్కడ తగ్గిపోతుందో అని బాధపడుతూ ఉంటారు. దీనికి కొద్దిగా శ్రమ అనుకోకుండా .. చిన్న చిన్న చిట్కాలు అనుసరించాల్సి ఉంది. తద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందినవారము అవుతాము. అవేమిటో తెలుసుకుందాం..!

* శీకాయ‌ను మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిలో నీటిని కలిపి తలకు పట్టించి గంట తర్వాత తలస్నానము చేయాలి. ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే జుట్టు రాలటం తగ్గుతుంది.

* కుంకుడు కాయలను నలకొట్టి గింజలను తీసేసి వేడి నీటిలో నానబెట్టి ఆ నీటితో తలను రుద్దుకోవాలి. ఈ విధంగా ప్రతి వారం చేస్తూ ఉంటే ఆ సమస్య నుండి బయటపడవచ్చు. మార్కెట్ లో కుంకుడు కాయ పొడి కూడా దొరుకుతుంది. అది కూడా ఉపయోగించవచ్చు.

tips for healthy hair and reduce hair fall * కలబంద గుజ్జును తలకు పట్టించి ఒక గంట తర్వాత తలస్నానము చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గిపోతుంది. అయితే తాజా కలబంద జ్యుస్ ని ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుంది.

* ఉసిరికాయను పేస్ట్ చేసి దానిలో రోజ్ వాటర్ కలిపి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానము చేయాలి. వీటిలో ఉండే ప్రోటీన్ ప‌దార్థం, విటమిన్ సిఇత‌ర పోషకాలు జుట్టు రాలడాన్ని తగ్గించి జుట్టు కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

Related posts