telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

వీడియో వైరల్ : బేస్‌బాల్ గేమ్‌ను ఆపిన జింకలు

Deers

అమెరికాలో రెండు యూనివర్శటీల మధ్య ఆసక్తికరంగా సాగుతున్న బేస్‌బాల్ గేమ్‌ను కొద్దిసేపు మూడు జింకల వల్ల ఆగిపోయింది. కేస్ వెస్ట్రన్ రిజర్వ్ యూనివర్శిటీ, బ్రాండీస్ యూనివర్శిటీ మధ్య శనివారం ఇన్నింగ్స్ జరుగుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. బాల్‌పార్క్ ఫీల్డ్‌‌లోని రైట్ ఫెన్సింగ్‌ నుంచి మూడు జింకలు లోపలకు ప్రవేశించి ఫీల్డ్‌ అవతలి పక్కకు వెళ్లాయి. లెఫ్ట్ ఫీల్డ్ నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా.. ఫెన్సింగ్ ఎత్తుగా ఉండటంతో ఎటు నుంచి వచ్చాయో మళ్లీ అటుగానే జింకలు బయటకు వెళ్లిపోయాయి. జింకలు రావడంతో కాసేపు గేమ్‌ను ఆపిన టీమ్‌లు తిరిగి కంటిన్యూ చేశారు. జరిగిన దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టగా.. ఈ వీడియోను నెటిజన్లు తెగ ఆనందిస్తున్నారు.

Related posts