telugu navyamedia
సినిమా వార్తలు

ఎన్.జి.కే : “తిరగబడు…” వీడియో సాంగ్

surya ngk movie teaser

తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవల సూర్య నటించిన “ఎన్జీకే” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించింది. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. హీరో సూర్య ట్విట్టర్ వేదికగా ఎన్జీకే ఫ్లాప్ పై హుందాగా స్పందించాడు. తాజాగా ఈ చిత్రం నుంచి “తిరగబడు…” అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. త్వరలో సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “కాప్పాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts