telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పంది మాంసం తింటాన‌ని చెప్పిన ర‌ష్మిక‌

Rashmika

దాన్ని కాల్చుకొని తింటే చాలా బాగుంటుందని, దానికి తోడుగా కాస్త వైన్ ఉంటే ఇక స్వర్గమే అంటోంది రష్మిక. రష్మికా తన డైట్ ప్లాన్ గురించి ఇటీవల హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన నడుపుతున్న యువర్ లైఫ్ అనే సైట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అందులో తాను పంది మాంసం తింటానని, దాన్ని కాల్చుకు తింటే ఆ రుచే వేరని ఈ అమ్మడు చెప్పింది. అయితే ఈ వెబ్‌సైట్ ద్వారా ఉపాసనా ప్రజలలో ఆరోగ్యంపై అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హీరోయిన్స్ ని తీసుకొచ్చి వారికి నచ్చిన ఆరోగ్య కరమైన వంటను చేయిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి అక్కడికి వెళ్లిన రష్మిక తన ఆహారపు అలవాట్లను పంచుకుంది. ఇందులో భాగంగా రష్మిక ‘కోలీ పుట్టు‘ అనే వంటను వండింది. దీంతో పాటు ఆమెను ఉపాసనా అనేక ప్రశ్నలు వేసింది. మీరు కోర్గి సామాజిక వర్గానికి చెందినవారా? మీరు పంది మాంసం బాగా తింటారు కదా? అన్న ప్రశ్నలు వేసింది. ఈ ప్రశ్నలకు రష్మికా అవుననే సమాధానం ఇచ్చింది. తాను పంది మాంసం ఇష్టంగా తింటానని, దీంతో పాటు రెండు గ్లాసుల వైన్ ఉంటే ఇక స్వర్గం అంటూ చెప్పుకొచ్చింది. దానితో పాటుగా తాము ఇంట్లోనే వైన్ తయారు చేసుకుంటామని, పంది మాంసం, వైన్‌లతో వివిధ రకాల వంటలు చేసుకుంటామని చెప్పింది. పంది మాంసం తిని నిద్ర పోయే ముందు రెండు కప్పుల వైన్ తాగితే ఇక హాయిగా నిద్ర వస్తుందని తన ఆహార అలవాట్లను వివరించింది.

Related posts