telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఈగ” స్పూర్తితో “చీమ-ప్రేమ మధ్యలో భామ”… సాంగ్ రిలీజ్

Chima

చీమ ప్రధాన పాత్రలో కనిపించే ఈ మాగ్నమ్ ఓపస్ ఫిలిమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ సినిమాలో హీరో హీరోయిన్లు 2016లో మిస్టర్ ఇండియాగా, 2018లో ఫెమినా మిస్ ఇండియా తెలంగాణ ఫైనలిస్ట్ కావడం ప్రత్యేక ఆకర్షణ. “రాజమౌళిగారి ‘ఈగ’ చిత్రం మాకు స్ఫూర్తి దాయకం’’ అన్నారు చిత్ర నిర్మాత లక్ష్మీనారాయణ. ఆయన మాట్లాడుతూ… “అల్పప్రాణి చీమ పాత్రని అపురూపంగా మలచిన తీరుకు అద్దం పట్టేలా మధురాతి మధుర గాయకులు పద్మభూషణ్ ఎస్‌పి బాలసుబ్రమణ్యంగారు టైటిల్ సాంగ్ ‘చీమ-ప్రేమ మధ్యలో భామ’ను అద్భుతంగా ఆలపించారు. రవివర్మగారి సంగీత సారధ్యంలో రూపొందిన ఈ పాట- బాణీ పదికాలాలు అందరినీ అలరిస్తుందని మా ప్రగాఢ విశ్వాసం” అని అన్నారు. అమిత్, ఇందు, సుమన్, హరిత, పురంధర్, వెంకట్ నిమ్మగడ్డ, రమ్య చౌదరి, బొమ్మ శ్రీధర్, రవి కిషోర్, కిషోర్ రెడ్డి, వెంకటేశ్, సురేష్ పెరుగు తదితరులు ఈ చిత్రంలో నటించారు.

Related posts