telugu navyamedia
telugu cinema news trending

టాలీవుడ్ సినీ పెద్దలకు సీఎం కేసీఆర్ భరోసా

TFI

తెలంగాణ సీఎం కేసీఆర్ టాలీవుడ్ పెద్దలకు హామీ ఇచ్చారు. సినీ పరిశ్రమను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం ప్రగతి భవన్‌లో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, సినీ పెద్దలు, ప్రముఖులు సీఎం కేసీఆర్‌ను కలిశారు. సుమారు అరగంటకు పైగా జరిగిన ఈ చర్చ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ సందర్భంగా షూటింగ్‌లకు అనుమతి ఇవ్వాలని సీఎంను కోరారు. అదే విధంగా థియేటర్స్ కూడా ఓపెన్ చేయాలని సీఎంకు సినీ పెద్దలు విజ్ఞప్తి చేశారు. సమావేశం అనంతరం తలసాని మీడియాతో మాట్లాడుతూ… మరో రెండు, మూడు దఫాల చర్చల తర్వాత విధివిధానాలు రూపొందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారన్నారు. సినీ ఇండస్ట్రీని అన్ని విధాలా ఆదుకుంటామని కేసీఆర్ భరోసా ఇచ్చారని మంత్రి మీడియా ముఖంగా వెల్లడించారు. మొత్తానికి ఒకటి రెండ్రోజుల్లో షూటింగ్స్, థియేటర్స్ ఓపెనింగ్‌పై తుది నిర్ణయం వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే.. మెగాస్టార్ చిరంజీవి నివాసంలో తలసాని ఆధ్వర్యంలో సినీ ప్రముఖులు నాగార్జున, రాజమౌళి, త్రివిక్రమ్, ఎన్. శంకర్, అల్లు అరవింద్, దిల్ రాజు, రాధాకృష్ణ, సి. కళ్యాణ్, సురేష్ బాబు, కొరటాల శివ, జెమిని కిరణ్, మెహర్ రమేష్, ప్రవీణ్ బాబు తదితరులు భేటీ అయ్యి నిశితంగా చర్చించారు. కాగా ఇప్పటికే ఏపీలో సినిమాలు, సీరియల్స్ షూటింగ్ జరుపుకోవచ్చని జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం విదితమే.

Related posts

బిగ్ బాస్-3 : మంచోడిని బయటకు పంపిస్తారా ?

vimala p

బాలీవుడ్ సూపర్ హిట్ రీమేక్ లో రాజ్ తరుణ్

vimala p

సర్కస్ ట్రైనర్ పై పులుల దాడి… బాడీని చీల్చేసిన వైనం

vimala p