telugu navyamedia
రాజకీయ వార్తలు

తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా!

padmarao dy speaker

తెలంగాణలో కరోనా వైరస్ అన్నీ శాఖలను టచ్ చేస్తోంది. వివిధ శాకల ఉద్యోగులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే తెలంగాణ హోమ్ మంత్రి మహమూద్ అలీ కరోనాబారిన పడగా, తాజాగా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన అనారోగ్యంగా ఉండటంతో ఆదివారం నుంచే హోమ్ క్వారంటైన్ అయ్యారు. వైద్యాధికారులు నమూనాలు సేకరించి పరీక్షలకు పంపగా కరోనా సోకినట్టు తేలింది. ఇంట్లో ఇద్దరు మనవలకు కూడా వైరస్ సోకింది. వీరందరినీ హోమ్ ఐసోలేషన్ లోనే ఉంచి చికిత్సను అందిస్తున్నారు.

మోండా మార్కెట్ కు దగ్గర్లోని టక్కర బస్తీలో నివాసం ఉండే పద్మారావు, ఇటీవలి కాలంలో, పలు సమీప బస్తీల్లో తిరిగి కరోనా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తన పర్యటనల్లో ఎవరి ద్వారానో ఆయనకు వైరస్ సోకుండవచ్చని తెలుస్తోంది. పద్మారావు ఇద్దరు మనవళ్లకు వైరస్ సోకిందని కుటుంబీకులు తెలిపారు. అందరి ఆరోగ్య పరిస్థితీ మెరుగుపడుతోందని అన్నారు.

నిన్న తెలంగాణలో 975 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 15,394కు చేరగా, మృతుల సంఖ్య 253కు పెరిగింది. వివిధ ఆసుపత్రుల్లో 9,559 మంది చికిత్స పొందుతుండగా, 5,582 మంది కోలుకున్నారు. ఎక్కువ కేసులు గ్రేటర్ పరిధిలో నమోదు కావడంతో మరోసారి నగరంలో లాక్ డౌన్ విధించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది.

Related posts