telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోకు నా జీవితంలోనే కాదు.. హృదయంలోనూ స్థానం… శ్రద్ధ కపూర్

Shraddha

బాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ ధావన్‌, హీరోయిన్ శ్రద్ధా కపూర్ తాజాగా కలిసి నటించిన `స్ట్రీట్ డ్యాన్సర్3డీ` శుక్రవారం ప్రేక్షకుల ముందకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా మీడియాతో మాట్లాడిన శ్రద్ధ.. వరుణ్‌పై తనకున్న అభిమానాన్ని వెల్లడించింది. “వరుణ్, నేను చిన్నప్పటి నుంచే స్నేహితులం. నా జీవితంలోనే కాదు.. నా హృదయంలో కూడా వరుణ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. వరుణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఓ అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. చాలా సింపుల్‌గా ఉండే వరుణ్‌ను ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. వెండితెరపై వరుణ్‌ను చూసి చాలా సంతోషపడుతుంటా. అతడితో కలిసి పనిచేయడం నాకెప్పుడూ స్పెషల్” అని శ్రద్ధ చెప్పుకొచ్చింది.

Related posts