telugu navyamedia
వార్తలు సామాజిక సినిమా వార్తలు

ఎక్కడ స్కామ్ ఉంటే అక్కడ నిలుస్తావు.. పీవీపీపై బండ్ల గణేశ్ విమర్శలు

bandla ganesh in bigg boss 3 conditions apply

సినీ నిర్మాతలు బండ్ల గణేశ్, పీవీపీల మధ్య ఆర్థిక వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పీవీపీపై బండ్ల గణేశ్ ట్విట్టర్ వేదికగా విమర్శల వర్షం కురిపిస్తున్నారు. వరుస ట్వీట్లతో తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. ఆయన పేరు నేరుగా ప్రస్తావించకుండా ‘స్కామ్ రాజా’ అంటూ ఘాటైన విమర్శలు చేస్తున్నారు. తన గురించి తెలుగు ఇండస్ట్రీ పెద్ద.. యాభై ఏళ్ల నుంచి ఫైనాన్సియర్‌గా ఉన్న సత్తి రంగయ్యను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తన గురించి క్యారెక్టర్ లేనోడు చెప్పేది అంటూ తీవ్రవ్యాఖ్యలు చేశారు.

తాను ఉండేది, చచ్చిపోయేది హైదరాబాదులోనేనని… నువ్వు ఇండియాలో ఉండవనే సంగతి తనకు తెలుసని చెప్పారు. గోవాలో ఒక ఇల్లు, లండన్ లో మరో ఇల్లు కట్టుకుంటున్నావని అన్నారు. స్కామ్ ల నుంచి తప్పించుకుని పారిపోవాలని చూస్తున్నావంటూ దుయ్యబట్టారు. స్కామ్ ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ నిలుస్తావని విమర్శించారు. నీకు రెండు ఇంగ్లీష్ ముక్కలు నేర్పించి భగవంతుడు తప్పు చేశాడనిపేర్కొన్నారు.

Related posts