telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నయనతార అసిస్టెంట్లకు షాకింగ్ జీతాలు… అసలు విజయాలు బయటపెట్టిన నిర్మాత

Nayan

నయనతార దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. సినిమాలో ఒక పాత్ర ఇస్తే ఆ పాత్రకు ప్రాణం పోసే అద్భుత నటి. ఆమె ఇది వరకు చేసిన ప్రతి సినిమాలో నయనతార నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.శ్రీరామరాజ్యంలో సీత పాత్రలో ఆమె నటనకు ముగ్ధులైపోయారు. సింహ సినిమాలో ఆమె నటనకు జేజేలు కొట్టాల్సిందే. వాస్తవానికి ఏదైనా సినిమాలో నయనతార ఉందంటే.. కచ్చితంగా ఆమె హైలైట్ అవుతుంది. ఒకానొక సందర్భంలో హీరోను సైతం డామినేట్ చేసే సత్తా ఆమెది. నయనతార అటు లేడి ఓరియెంటెడ్ చిత్రాలు, ఇటు గ్లామర్ రోల్స్ తో దూసుకెళ్తోంది. స్టార్‌ హీరోయిన్‌గా కోలీవుడ్‌లో నయనతార స్థానం పదిలం. ఆమె సినిమాల్లో హీరో నామమాత్రమే. అసలైన హీరో ఆమె. ఆమె పేరుతోనే కోట్లు వచ్చి పడుతుంటాయి. మరోవైపు భారీ బడ్జెట్ సినిమాల్లోనూ నటిస్తూ భారీ క్రేజ్ ను మూటగట్టుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. దక్షిణాదిన అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉంది. ప్ర‌స్తుతం ఇటు తెలుగు, అటు త‌మిళంలో బిజీగా ఉన్న హీరోయిన్లలో ఒక‌రు. అయితే నయనతార కోసం సెట్స్‌లో పెట్టే ఖర్చులు అంతా ఇంతా కాదు అంటూ ప్రముఖ తమిళ నిర్మాత రాజన్ షాకింగ్ విషయాలను బయటపెట్టారు. నయనతార ఏదన్నా సెట్‌కు వెళితే ఆమెతో పాటు ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉండి తీరాల్సిందేనట. వారికి ఒక్కొక్కరికి రోజుకి ఏడు నుంచి ఎనిమిది వేల రూపాలయ వరకు జీతం సమర్పించుకోవాలట. “నయనతారతో పాటు మరో ఆరు, ఏడుగురు అసిస్టెంట్స్ కూడా ఉంటారు. వారికి రోజుకు ఏడు నుంచి పన్నెండు వేల వరకు జీతాలు ఇవ్వాలి. నాకు తెలిసిన వారు ఈ విషయాలు చెప్పారు. కాబట్టి వారు చెప్పేది నిజమే అయివుంటుంది. ఈ రకంగా చూసుకుంటే నయన్ అసిస్టెంట్స్‌కు రోజుకు 75 నుంచి 80 వేల రూపాయల వరకు ఇవ్వాలి. ఒకవేళ నయన్ 50 రోజుల పాటు సెట్స్‌కు వస్తే పరిస్థితేంటో ఆలోచించండి. నిర్మాత సినిమా కోసం తెచ్చిన డబ్బును నయనతార అసిస్టెంట్స్ పైనే ఖర్చు అయిపోతుంది. దీనికి తోడు నయనతార డ్రైవర్స్‌కి, డీజిల్ ఖర్చులు ఎంత ఉంటాయో ఆలోచించండి. వీటికి తోడు కారవ్యాన్ల కోసం కూడా నిర్మాతలు భారీగా ఖర్చు చేస్తారు. ఒక్కో కారవ్యాన్‌ను మెయింటైన్ చేయాలంటే దాదాపు కోటి రూపాయలు అవుతుంది. ఓ భారీ సినిమా తీయాలంటే రోజూ తొమ్మిది కారవ్యాన్లు కావాల్సి వస్తుంది. ఒక్కో కారవ్యాన్‌ను మెయింటైన్ చేయాలంటే తొమ్మిది నుంచి పదివేల వరకు ఖర్చు అవుతుంది. అంటే నిర్మాత ఒక్క రోజు కారవ్యాన్‌కే లక్ష నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఎంజీఆర్, శివాజీ గణేశణ్‌లు అయితే అసలు ఎప్పుడూ కారవ్యాన్‌ను వాడలేదు. షూటింగ్‌కి వాళ్ల వాహనాల్లోనే వచ్చేవారు” అంటూ అసహనం వ్యక్తం చేశారు.

Related posts