స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(సెయిల్), న్యూఢిల్లీ, ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సెయిల్ వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 142 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచీ ధరఖాస్తులని కోరుతోంది.
విభాగాల వారీ ఖాళీలు : మెకానికల్ ఇంజనీరింగ్- 66, మెటలర్జికల్ ఇంజనీరింగ్-7, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్-41, కెమికల్ ఇంజనీరింగ్-10, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్-15, మైనింగ్ ఇంజనీరింగ్-3.
అర్హత : పోస్టులను బట్టి సంబంధిత బ్రాంచుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు : 2019, జూన్ 14 నాటికి 28 ఏళ్లకు మించకూడదు. ఓబీసీ (ఎన్‌సీఎల్)లకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; పీడబ్ల్యూడీలకు పదేళ్లు గరిష్ట వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక : గేట్-2019 స్కోరు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరితేదీ : జూన్ 14, 2019.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ : www.sailcareers.com చూడగలరు.