telugu navyamedia
telugu cinema news

పద్మశ్రీ రావడం ఇబ్బందికరంగా ఉంది : స్టార్ హీరో

Saif-Ali-Khan

భార‌త ప్ర‌భుత్వం అందించే ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ‌శ్రీ పురుస్కారం ద‌క్క‌డాన్ని సినిమా వాళ్లు ఒక గౌర‌వంగా భావిస్తుంటారు. అయితే బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ మాత్రం ఇబ్బందిగా ఫీల‌వుతున్నాడ‌ట‌. అర్భాజ్ ఖాన్ నిర్వ‌హిస్తున్న ఓ కార్యక్రమానికి అతిథిగా హాజ‌రైన సైఫ్ అలీఖాన్ తన‌కు ప‌ద్మ‌శ్రీ పురస్కారం రావ‌డం గురించి చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారాయి. ఈ షోలో సైఫ్ మాట్లాడుతూ “నేను ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారాన్ని కొనుక్కున్నాన‌ని చాలా మంది సోష‌ల్ మీడియా ద్వారా విమ‌ర్శించారు. నిజానికి నా కంటే చాలా ప్ర‌తిభ ఉన్న న‌టుల‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం రాలేదు. నాకు రావ‌డం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆ పుర‌స్కారాన్ని స్వీక‌రించాల‌ని నాకు లేదు. ప‌ద్మ‌శ్రీని వెన‌క్కి తిరిగి ఇచ్చేయాల‌నుకున్నా. `నువ్వు భార‌త ప్ర‌భుత్వాన్ని తిర‌స్క‌రించే స్థాయిలో లేవు` అని మా నాన్న అన్నారు. దాంతో వెన‌క్కి త‌గ్గాను. నిజానికి నాకంటే త‌క్కువ స్థాయి న‌టులు కొంద‌రు ఇప్ప‌టికే ఆ పుర‌స్కారాన్ని అందుకున్నారు” అని అన్నారు.

Related posts

అవెంజర్స్-4: ఎండ్ గేమ్” లేటెస్ట్ ట్రైలర్

ashok

అబ్దుల్ కలాం .. బయోపిక్ పై అధికారిక ప్రకటన..

vimala p

విద్యాబాలన్ హాట్ క్లివేజ్ పిక్ వైరల్

vimala p