telugu navyamedia
సినిమా వార్తలు

“కబీర్ సింగ్” బాహుబలి-2 కంటే 16 రెట్లు ఎక్కువ : రామ్ గోపాల్ వర్మ

Ram gopal Varma Fire Censor board

తెలుగులో సంచలన విజయం సాధించిన “అర్జున్‌ రెడ్డి” రీమేక్‌ “కబీర్ సింగ్”తో బాలీవుడ్‌కు పరిచయం అయ్యాడు సందీప్. షాహిద్‌ కపూర్‌ హీరోగా తెరకెక్కిన “కబీర్‌ సింగ్” బాలీవుడ్ లో రికార్డ్ లు క్రియేట్ చేస్తోంది. అయితే ఈ సినిమాపై బాలీవుడ్ సినీ విమర్శకులు మాత్రం పెదవి విరిచారు. ఇటీవల సందీప్ రెడ్డి వంగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండ‌ద‌ని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. అయితే ఈ వ్యాఖ్యలపై సందీప్ రెడ్డి వంగా వివరణ కూడా ఇచ్చుకున్నాడు. అయితే గతంలో సందీప్ పంగాను ప్రశంసించిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనకు అండగా నిలిచారు. “సందీప్ ఎంతో నిజాయతీగా, ధైర్యంగా ఇంటర్వ్యూ ఇచ్చాడు. నాకు అది చాలా నచ్చింది’’ అంటూ వర్మ ట్వీట్ చేశారు. అంతేకాక.. బాహుబలి కంటే కబీర్ సింగ్‌కు ఎక్కువ లాభాలు వచ్చాయి. నా దృష్టిలో ‘కబీర్ సింగ్’ బాహుబలి-2 కంటే 16 రెట్లు ఎక్కువ లాభాలు సాధించింది. కబీర్ సింగ్ ఆరు నెలల్లో తీస్తే.. బాహుబలికి రెండేళ్లు పట్టింది. మన సినిమాల్లోని రొటిన్ పాత్రలకు జనాలు అలవాటుపడ్డారు. కానీ సందీప్ ఆ గతిని మార్చాడు. కానీ కబీర్ సింగ్ సాధించిన ఘన విజయం అతనేంటో ప్రపంచానికి పరిచయం చేసింది” అని వర్మ పేర్కొన్నారు. ఈ ట్వీట్లతో పాటు సందీప్‌తో కలిసి దిగిన ఫొటోని కూడా వర్మ ట్వీట్ చేశారు.

Related posts