telugu navyamedia
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తి చేసుకున్న “రాజుగారిగది-3”

RGG

ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన హార‌ర్ కామెడీ చిత్రం “రాజుగారిగ‌ది” చిన్న చిత్రంగా తెరకెక్కి భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. ఆ తరువాత ఈ సినిమాకు సీక్వెల్ గా “రాజుగారి గది-2” చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో నాగార్జున, సమంత కీలకపాత్రల్లో నటించారు. అయితే “రాజుగారిగది” ఆకట్టుకున్నంతగా “రాజుగారి గది-2” ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ ఫ్రాంచైజీలో రూపొందిన మూడో భాగం “రాజుగారిగ‌ది 3”. అశ్విన్‌బాబు, అవికాగోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుని యు/ఎ స‌ర్టిఫికేట్‌ను పొందింది. ఈ చిత్రాన్ని అక్టోబ‌ర్ 18న విడుద‌ల చేస్తున్నారు. ఓక్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై సినిమా నిర్మిత‌మైంది. ష‌బీర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి ఛోటా కె.నాయుడు సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఇటీవ‌ల విడుద‌లైన ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌, ట్రైల‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి.

Related posts