telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సుమ ఇంట్లో తీవ్ర విషాదం… రాజీవ్ కనకాల చెల్లెలు మృతి

Srilakshmi

ప్రముఖ నటులు, దర్శకులు, ఎందరో నటనలో ఓనమాలు నేర్పించిన గురువు దేవదాసు కనకాల గారి ఏకైక కుమార్తె, రాజీవ్ కనకాల చెల్లెలు శ్రీలక్ష్మీ హఠాన్మరణం చెందారు. గతకొంత కాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న శ్రీలక్ష్మీ సోమవారం (ఏప్రిల్ 6) తుదిశ్వాస విడిచారు. ఆమె భర్త రామారావు పెద్ది సీనియర్ జర్నలిస్ట్. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. కొద్దిరోజుల క్రితం దేవదాస్ కనకాల శ్రీమతి లక్ష్మీ, అనంతరం దేవదాస్ కనకాల, ఇప్పుడు శ్రీలక్ష్మీ మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అడపాదడపా పలు సీరియల్స్‌లో నటించిన శ్రీలక్ష్మీ నటిగా రాణించలేకపోయారు. ఆమె మరణంతో రాజీవ్ కనకాల విషాదంలో మునిగిపోయారు. శ్రీలక్ష్మీ మరణవార్త తెలియగానే పలువురు సినీ, టీవీ రంగాలకు చెందినవారు సంతాపం తెలియచేస్తున్నారు.

Related posts