హీరోయిన్ ను గ్లామరస్ గా చూపించడంలో కే.రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా కమర్షియల్ మూవీస్ కు కేరాఫ్ అడ్రస్. భక్తి చిత్రాలను తీసి ప్రేక్షకులను పరవశింపజేసాడు. హీరోలను తెరపై అందంగా చూపిస్తాడనే కారణంతో ఆయనను అందరు దర్శకేంద్రుడు అని పిలుస్తుంటారు. ఇక రాఘవేంద్రరావుకు దర్శకేంద్రుడు అనే బిరుదు ఇచ్చింది ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు. రాఘవేంద్రరావు తన చిత్రానికి సంబంధించిన ఓ సినీ వేడుకలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆ వేడుకలకు సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎంతో మంది పెద్దలు హాజరయ్యారు. అందలో ప్రముఖ సినీ పాటల రచయత పద్మభూషణ్ డాక్టర్ సి. నారాయణ రెడ్డి రాఘవేంద్రరావును దర్శకేంద్రుడు అని మొదట సంభోదించారట.
previous post