telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

రోజు గుప్పెడు వేరుశనగలు… అన్ని వయసుల వారికి మేలు..

peanuts and health benefits to all

సమతుల్యత ప్రకృతిలో సహజంగా ఉంది, అది తెలియజేయడానికే ఆహార అందుబాటు ఏర్పాటు చేయబడింది. చక్కటి పోషకాలు ఉన్న ఆహారం అతి తక్కువ ధరల(వేరుశనగ)కు అలాగే ఎక్కువ ధరలలో(బాదాం, జీడిపప్పు)ను అందుబాటులో ఉంటున్నాయి. ఎవరి స్థాయిలను అనుగుణంగా వారు ఆయా పదార్దాలను తీసుకోని ఆరోగ్యంగా ఉండవచ్చు. ఇక వేరుశనగల విషయానికి వస్తే, వీటిలో అద్భుతమైన పోషకాలున్నాయి. ఈ వేరుశనగలు మధుమేహం, గుండెపోటు, గర్భాశయ సమస్యలు, కేన్సర్, ఒబిసిటీకి వంటి వ్యాధుల నుండి కాపాడుతాయి. వీటిలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమంగా తీసుకునేవారిలో గర్భాశయ సమస్యలుండవు. గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో గడ్డలు, సంతానలేమిని దూరం చేసుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.

రోజూ 30 గ్రాముల వేరుశనగలు తింటే హార్ట్ వాల్స్‌ను భద్రపరిచినవారవుతారు. యాంటీయాక్సిడెంట్స్.. గుండెపోటును నివారిస్తుంది. శరీర బరువును తగ్గిస్తుంది. ఇందులోని యాంటీయాక్సిడెంట్స్ వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. వృద్ధాప్య ఛాయలకు చెక్ పెడుతుంది. జ్ఞాపకశక్తిని పెంచుతుంది. రక్తప్రసరణను క్రమబద్ధీకరిస్తుంది. మానసిక ఒత్తిడిని దూరం చేస్తుంది.

వేరుశనగలలోని మాంగనీస్, రక్తంలోని పిండి పదార్థాలు కొవ్వును క్రమబద్ధీకరిస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయిని తగ్గిస్తుంది. తద్వారా డయాబెటిస్‌ను దూరం చేసుకోవచ్చు. అందుచేత మధుమేహ వ్యాధిగ్రస్థులు రోజుకు ఓ గుప్పెడు వేరుశెనగల్ని తినాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పిల్లలు, వృద్ధులు వేరుశెనగల్ని తీసుకోవడం ద్వారా ఎముకల వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చు.

నట్స్‌లోని బాదం, పిస్తా కంటే వేరుశెనగలలోనే అధిక పోషకాలున్నాయి. మహిళలకు కావలసిన ఫోలిక్ యాసిడ్, ఫాస్పరస్, క్యాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఇ1, ఇ12, నియాసిన్, పీచు వంటివి ఉన్నాయి.

Related posts