telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

బహిరంగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోనున్న అమెరికా ఉప అధ్యక్షుడు….

corona vacccine covid-19

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ కు తాము వ్యాక్సిన్ కనిపెట్టమని అమెరికా తెలిపింది. అందుకు రుజువుగా ఉప అధ్యక్షుడు మైకె పెన్స్ శుక్రవారం నాడు బహిరంగంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోన్నాడు. వారు తమ వ్యాక్సిన్‌పై ప్రజలలో నమ్మకం పెంచేందుకే ఇలా చేస్తున్నారు. మైక్ పెన్స్ వైట్ హౌస్‌లోని కరోనా నియంత్రణా టాస్క్ ఫోర్స్ నాయకుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అతడితోపాటుగా కారెన్ పెన్స్, సర్జన్ జనరల్ జెరోమ్ ఆడమ్స్ కూడా వ్యాక్సిన్‌ను తీసుకొనివారిలో ఉన్నారు. దీనిని వైట్ హౌస్‌లోనే నిర్మహించనున్నారు. మనం కేవలం ప్రారంభం చేశామని, ఇంకా ఎంటువంటి డెవలప్‌మెంట్ చేసినట్లు కాదని ఇటీవల జరిగిన సమావేశంలో పెన్స్ అన్నారు. అంతేకాకుండా వ్యాక్సిన్ తీసుకునేందుకు నేను సిద్దంగా ఉన్నాను ఎటువంటి ఇతర ఆలోచనలు లేకుండా దీనిని చేయాద్దామన్నారు. అయితే ఈ వారం మొదట్లో అమెరికా రక్షణ సెక్రటరీ క్రిస్ మిల్లర్ వ్యాక్సిన్‌ను బహిరంగంగా తీసుకున్నారు. దాని తరువాత దేశంలోని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) నిర్ణయం ప్రకారం అత్యవసర పరిస్థితులలో దీనిని వాడేందుకు ఇతర రాష్ట్రాలకు తరలించారు.

Related posts