telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

అధికబరువుతో.. 65 రకాల రోగాలకు స్వాగతం చెప్పినట్టే…

over weight raises almost 65 diseases

నేటి జీవనవిధానంలో వేళాపాలా లేని తిండి, స్సైసీ ఆహారం తీసుకోవడం, విపరీతమైన పని ఒత్తిడి, ప్రశాంతత లేని జీవితం, మారుతున్న జీవన శైలితో రోగాలను అరువు తెచ్చుకుంటున్నాడు. బయట ఏది దొరికితే అది తినేసి పొట్ట నింపుతున్నాడు. దానికితోడు శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నాడు. వీటన్నింటి ఫలితంగా అధిక బరువు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాడు. సాంప్రదాయ వంటకాలకు తిలోదకాలిచ్చి విదేశీ రుచులకు అలవాటు పడి పెద్దలు, పిల్లలు, యువకులు అందరూ ఒబేసిటీ బారినపడుతున్నారని, 65 జబ్బులకు అధిక బరువే కారణమవుతోందని వైద్యులు చెబుతున్నారు. ప్రతి ఏడుగురిలో ముగ్గురు యువకులు, ప్రతి నలుగురు విద్యార్థుల్లో ఒకరు అధిక బరువు బారిన పడుతున్నారని ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం వారంతా బరువును తగ్గించుకునేందుకు వైద్యులను సంప్రదిస్తున్నారు. గ్రేటర్‌ పరిధిలో నెలకు 100 నుంచి 150 బేరియాట్రిక్‌ సర్జరీలు, లైపోసక్షన్‌ సర్జరీలు 70 నుంచి 80 వరకు జరుగుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు.

ప్రత్యక్షంగా, పరోక్షంగా 65కు పైగా జబ్బులకు అధిక బరువు కారణమవుతోందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. మధుమేహం, గుండెజబ్బులు, అధిక రక్తపోటు, స్లీప్‌ అప్నెయా, ఆర్థరైటిస్‌, జాయింట్‌ పెయిన్స్‌, పక్షవాతం, గాల్‌ స్ట్రోన్స్‌, వ్యంధత్వం వంటి సమస్యలు ఒబేసిటీతోనే వస్తున్నాయి. ఉండాల్సిన బరువు కంటే కిలో గ్రాము బరువు ఎక్కువగా ఉంటే రోజుకు 350 కిలో మీటర్ల దూరం ఎక్కువగా రక్తాన్ని నెట్టాల్సిన భారం గుండెపై పడుతుందని వైద్యులు వివరించారు. అధిక బరువును మోయలేక కీళ్లు త్వరగా అరిగిపోవడంతో నడవలేరని చెబుతున్నారు. దీంతో శారీరక శ్రమ మరింత తగ్గి బరువు పెరిగే అవకాశాలు ఎక్కువవుతాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Related posts