telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

మరోసారి చుక్కలనంటిన ఉల్లి ధరలు!

onions

మహారాష్ట్రలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు తగ్గిపోయి ధరలు పెరిగిపోయిన విషయం తెలిసిందే. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో బహిరంగ మార్కెట్లలో ఉల్లి ధర కిలో రూ.100కి చేరడం ఆందోళన కలిగిస్తోంది.పెరిగిన ఉల్లి ధరలు సామాన్యుడికి కంటతడి పెట్టిస్తుండడంతో కేంద్ర ప్రభుత్వం వీటి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటోంది.

అఫ్ఘనిస్థాన్, ఈజిప్టు, టర్కీ, ఇరాన్ నుంచి ఉల్లి దిగుమతులకు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. కాగా, మార్కెట్లో వీటి ధరలు పెరిగిపోవడంతో సామాన్యుడు వీటిని కొనకుండానే వెనుదిరుగుతున్నాడు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉల్లి ధర కిలో రూ. 70 నుంచి 80 ధర పలుకుతోంది.

Related posts