telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఇస్మార్ట్” నిధికి కావాల్సింది ఇతగాడేనట…!

nidhi agarwal counter answer to

“ఇస్మార్ట్” పోరి నిధి అగర్వాల్ కూడా తనకు కాబోయే వాడి గురించి మనసులో మాట చెప్పింది. లక్ష్మి మంచు వ్యాఖ్యాతగా ‘వూట్’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ప్రసారమైయ్యే ‘ఫీటప్ విత్ స్టార్స్’ కార్యక్రమంలో పాల్గొంది నిధి అగర్వాల్. ఇందులో లక్ష్మి మంచుతో తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించి పలు విషయాలను పంచుకుంది. ఇంటర్వ్యూకు వచ్చిన నిధి అగర్వాల్ అందాలను చూసి..వామ్మో నువ్వు చాలా హాట్ అంటూ కామెంట్ చేసింది మంచు లక్ష్మి. ఇంత చల్లగా ఉన్న ఏసీ రూమ్‌లో కూడా వేడెక్కిస్తున్నావంటూ సరదాగా వ్యాఖ్యానించింది. వెంటనే స్పందించిన నిధి.. మీరు కూడా హాటే అంటూ మంచు లక్ష్మిని పొగిడింది. డిస్కషన్ మధ్యలో కాబోయే భర్త ఎలా ఉండాలని మంచు లక్ష్మి అడగడంతో.. తనకు రాముడి లాంటి వ్యక్తి జీవిత భాగస్వామగా కావాలని మనసులో మాటను బయటపెట్టింది నిధి అగర్వాల్. తన జీవితంలో కృష్ణులాంటి వాళ్లు చాలా మందే ఉన్నారనడంతో మంచు లక్ష్మి పడిపడి నవ్వింది. ఇక తనకు ఫ్లవర్స్, ఖరీదైన డిన్నర్ వద్దన్న నిధి.. ఇంటి వద్ద పిజ్జాలు తినకుంటూ సినిమా చూడలని.. ఇదే తన డ్రీమ్ డేట్ అని చెప్పుకొచ్చింది.

Related posts