telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు సినిమా వార్తలు

ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయింది: నిర్మాత సురేశ్ బాబు

Suresh Babu

అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ కారణంగా ప్రేక్షకులు థియేటర్లకు రావడం తగ్గిపోయిందని ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు అన్నారు. స్మార్ట్ ఫోన్ సాయంతో ప్రపంచం అరచేతిలో ప్రత్యక్షమవుతున్న ఈ రోజుల్లో సినిమా ప్రదర్శన అనేది కొత్తరూపం సంతరించుకుందన్నారు. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి కంటెంట్ ప్లాట్ ఫామ్ ల రంగప్రవేశంతో యూజర్లు ఎక్కడికీ వెళ్లకుండానే వినోదం లభ్యమవుతోంది. కొత్త సినిమాలు కూడా స్మార్ట్ ఫోన్లలో ప్రదర్శితమవుతున్నాయి. అయితే, ఈ తరహా ప్లాట్ ఫామ్స్ చిన్న సినిమాలు, థియేటర్లపై విపరీతమైన ప్రభావం చూపుతున్నాయని అభిప్రాయపడ్డారు.

ఏవో కొన్ని పెద్ద సినిమాలకు మాత్రమే ప్రేక్షకులు థియేటర్ల వరకు వస్తున్నారని పేర్కొన్నారు. మధ్యస్థ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలను థియేటర్లలో చూసేందుకు ప్రేక్షకులు ఏమంత ఆసక్తి చూపడంలేదని తెలిపారు. థియేటర్ యాజమాన్యాలు కనీసం ఆదాయం కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం నష్టాలపాలయ్యే పరిస్థితి నెలకొందని అన్నారు.

Related posts