telugu navyamedia
తెలంగాణ వార్తలు

తమిళనాడు సీఎం స్టాలిన్​తో ముగిసిన కేసీఆర్​ భేటి..

తమిళనాడు సీఎం స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్‌  చెన్నైలోని స్టాలిన్ ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని స్టాలిన్‌ను ఆహ్వానించారు సీఎం కేసీఆర్‌. అనంతరం దేశరాజకీయాలపై కూడా ఇద్దరు నేతలు చర్చించారు.

CM KCR Meets MK Stalin: తమిళనాడు సీఎం స్టాలిన్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్  భేటీ, యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం, థర్డ్ ఫ్రంట్ పైనా ఇరువురు  ...

కేంద్రంలోని భాజపా వైఖరి, ధాన్యం కొనుగోళ్లలో విధానం, రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సంబంధాలపైన చర్చించినట్లు సమాచారం. భాజపా వ్యతిరేక కూటమిపైనా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమాలోచనలు జరిపినట్లు తెలుస్తోంది. గోదావరి, కావేరి నదుల అనుసంధానం సైతం చర్చల్లో ప్రస్తావనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటిలో  సీఎం వెంట సతీమణి శోభ, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతోష్‌కుమార్‌ కూడా ఉన్నారు. 

తమిళ సీఎం స్టాలిన్‌తో కేసీఆర్‌ భేటీ

కాగా.. స్టాలిన్ సీఎం అయ్యాక ఆయనతో కేసీఆర్ భేటీ కావడం ఇదే తొలిసారి. మ‌రోవైపు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ స్టాలిన్‌ కుమారుడు , డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధితో భేటీ అయ్యారు.

KCR TAMILNADU CM STALIN MEET

రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం మధ్యాహ్నం కుటుంబ సమేతంగా హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో తమిళనాడుకు సీఎం కేసీఆర్‌ వెళ్ళారు. సీఎంతోపాటు ఆయన సతీమణి కె.శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య తదితరులు తరలివెళ్లారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు.

Related posts