telugu navyamedia
సినిమా వార్తలు

“అజ్ఞాతవాసి” తరువాతే “మహర్షి”… నాన్ బాహుబలి రికార్డ్స్

Maharshi

మహేష్ 25వ చిత్రం “మహర్షి” గురువారం విడుదలయ్యింది. మొదటి రోజు అనుకున్నట్టుగానే మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మహేష్ కి మంచి క్రేజ్ ఉన్న ఏరియాల్లో నాన్ బాహుబలి రికార్డ్స్ ను క్రియేట్ చేసింది “మహర్షి”. మొదటి రోజు 6.38 కోట్ల షేర్స్ ను అందుకొని టాలీవుడ్ లో బాహుబలి 2 తరువాత నైజాంలో డే-1 అత్యధిక షేర్స్ ను రాబట్టిన సినిమాగా మహర్షి నిలిచింది. మహేష్ భరత్ అనే నేను 4.48 కోట్లు రాబట్టగా ఈ సినిమా అంతకంటే ఎక్కువ లాభాలను అందించడం విశేషం. అయితే మహేష్ కొట్టిన ఈ సిక్సర్ సరికొత్త రికార్డ్ అయినప్పటికీ బాహుబలి 2 రికార్డ్ ను కొద్దీ దూరంలో మిస్ అయ్యింది. అయితే మహర్షి సినిమా పలు చోట్ల నాన్ బాహుబలి 2 రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. గుంటూరు ఏరియాలో ఎవరు ఊహించని విధంగా మొదటి రోజు 4.40 కోట్ల షేర్స్ ను రాబట్టి రెండవ స్థానంలో నిలిచింది. బాహుబలి 2 తరువాత ఇంతకుముందు వినయ విధేయ రామ (4.18కోట్లు) – అరవింద సమేత (4.16కోట్లు) సినిమాలు నిలువగా మహర్షి గుంటూరు రికార్డ్ ను బ్రేక్ చేశాడు.

మొదటిరోజు మొత్తంగా ఏపీ – తెలంగాణ కలెక్షన్స్ ని చూసుకుంటే మహేష్ సినిమా అనుకున్నంతగా రాబట్టలేకపోయింది. అసలైతే సినిమా తెలుగు రాష్ట్రలో 30 కోట్ల షేర్స్ ను రాబడుతుందని టాక్ వచ్చింది.. కానీ 24.67 కోట్ల దగ్గర కలెక్షన్స్ ఆగిపోయియాయి. అజ్ఞాతవాసి ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 26.36 కోట్ల షేర్స్ ను రాబట్టింది. ఇక అరవింద సమేత 26.60 కోట్లతో నాన్ బాహుబలి రికార్డ్స్ లో మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వినయవిధేయ రామ 26.03 కోట్లతో మూడవ స్థానంలో ఉంది. వీటి తరువాత మహేష్ మహర్షి 26.67కోట్లతో నాలుగవ స్థానాన్ని అందుకుంది.

Related posts