telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

బిగుస్తున్న ఉచ్చు.. రవిప్రకాశ్, శివాజీలకు లుకవుట్ నోటీసులు

Ravi Prakash

ఫోర్జరీ కేసులో చిక్కుకున్న టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాశ్, సినీ నటుడు శివాజీల కోసం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.  విచారణకు హాజరయేందుకు తమకు మరో 10 రోజులు గడువు కావాలని,  రవిప్రకాశ్, శివాజీలు పంపిన ఈ-మెయిల్స్ పై సంతృప్తి చెందని పోలీసులు  గాలింపు ముమ్మరంచేశారు. 

గత రెండు రోజులుగా కొన్ని బృందాలు రవిప్రకాశ్ ఆచూకీ కోసం గాలిస్తున్నాయని తెలుస్తోంది.  శుక్రవారం నుంచి మరో రెండు బృందాలు రంగంలోకి దిగాయని సైబరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు అంటున్నారు. అలంద మీడియా డైరెక్టర్ కౌశిక్‌రావు ఫిర్యాదుమేరకు ఈ కేసులో విచారణకు హాజరుకావాలని సైబరాబాద్ పోలీసులు పలు నోటీసులు పంపినా రవిప్రకాష్ పోలీసుల ముందుకు రావడం లేదు. దీంతో  పోలీసులు లుకవుట్ నోటీసులు జారీ చేశారు.

Related posts