telugu navyamedia
సామాజిక

101 ఏళ్ళ వరకు.. లైసెన్స్ .. మహా సీనియర్ .. 

police warns women against small clothes
ఈ తరం సరాసరి ఆయుప్రమాణం 60 ఏళ్ళని అందరికి తెలుసు. ఒకనాడు అదే మనిషి ఆయువు 100 ఏళ్ళ పైమాటే. అయితే అప్పటిది పాతకాలం, అభివృద్ధి లేనేలేనికాలం, అయినా అప్పట్లో సాధారణంగా మరణమే అంటే వారి వయసు కనీసం సెంచరీ దాటేది. ఇప్పటి గురించి అసలు ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మేలు. ఇక పనిలో కూడా అప్పటివారు చనిపోయే వరకు తమపనులు తామే చేసుకోవడమే కాదు, బ్రతుకుదెరువు(ఉద్యోగం) కూడా చివరిదాకా చేస్తూనే ఉండేవారు. ఇప్పటివారు 40ఏళ్ళు దాటేసరికే రిటైర్ కూడా అయిపోతున్నారు. ఇవన్నీ ఇప్పుడెందుకు అంటారా, ఈ తాత గురించి చెప్పుకు తీరాలి. 97 ఏళ్ళ వయసులో లైసెన్స్ రెన్యూవల్ చేయించుకున్న నాటి గట్టి ప్రాణం. ఆ తాతగారి వయసు 97 ఏళ్లు. అయినా తన ఫిట్‌నెస్‌ ఏమీ తగ్గలేదంటున్నారాయన. 
ఆయన మాటలను కొట్టేయలేక దుబాయ్‌ ప్రభుత్వం ముదిమి మీదపడిన వయసులోనూ ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌ను నాలుగేళ్లపాటు పొడిగించింది. 2023 వరకు ఆయన లైసెన్స్‌ గడువు పొడిగించడంతో దుబాయ్‌ రోడ్లపై కారు  నడిపే అత్యంత సీనియర్‌ ఇతనే కావచ్చునని భావిస్తున్నారు. వివరాల్లోకి వెళితే…భారత్‌ సంతతికి చెందిన టెహెంటెన్‌ హోమీ ధున్జీబోయ్‌ మెహతా దుబాయ్‌లో స్థిరపడ్డారు. 1922లో జన్మించిన మెహతా వయసు ప్రస్తుతం 97 ఏళ్లు. ఇటీవలే ఆయన లైసెన్స్‌ గడువు ముగియడంతో రెన్యువల్‌ చేయాలని అక్కడి విభాగానికి దరఖాస్తు చేశారు. మెహతా ఫిట్‌నెస్‌ను పరిశీలించిన అధికారులు నాలుగేళ్లపాటు పెంచారు. ఏమైనా అప్పటి మెషిన్ లు గట్టివి(నాణ్యమైనవి).. కదా!

Related posts