telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆదిపురుష్”లో ప్రభాస్ తో కృష్ణంరాజు ?

Prabhas

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రంగా ‘ఆదిపురుష్‌’ అనే సినిమాని చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెరకెక్కనుంది. ‘చెడు మీద మంచి సాధించిన విజయం’ అనేది ట్యాగ్ లైన్. రామాయణం ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఆదిపురుష్’ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఈ సినిమాని దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో టీ-సిరీస్ నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో సీతగా ఎవరు నటించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రంలో కృష్ణంరాజు నటిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రంలో రాముడు తండ్రి దశరధుడిగా ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. గతంలో ప్రభాస్, కృష్ణంరాజు కలిసి రెబల్ అనే సినిమాలో నటించారు. ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

ఇక ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో ప్రపంచ స్థాయి లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత విడుదలైన సాహో సినిమా తెలుగులో అంతగా ఆకట్టుకోకపోయినా హిందీలో భారీగా కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ఇక ప్రస్తుతం ప్రభాస్ రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అలాగే ఆదిపురుష్ చిత్రంతో బిజీగా ఉన్నారు.

Related posts