స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా చేస్తున్న సినిమా పుష్ప. పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కతున్న ఈ సినిమాకి స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్‌లు సినిమాపైన అంచనాలను మరింత అదికం చేశాయి. ఈ సినిమాను ఆగస్ట్13న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో “పుష్ప ఫస్ట్‌మీట్” పేరుతో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది చిత్ర బృందం. ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ చాలా ఎమోషనల్ అయ్యారు. “స్టైలీష్ స్టార్ అనే ట్యాగ్ బన్నీకి ఎప్పుడు వచ్చిందో నాకు తెలియదు. కానీ ఈ సినిమాలో బన్నీ నటన అద్భుతం. ప్రమాణం చేసి చెబుతున్నా.. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమా చూసిన తర్వాత మీరే ఆ మాట అంటారు. సినిమాలో అర్జున్.. నటన చూసిన తర్వాత స్టైలీస్ అనే పదం ఒక్కటే ఆయనకు సరిపోదనిపించింది. నా అభిప్రాయం ప్రకారం.. బన్నీ ఒక స్టైలీస్ స్టార్ కాదు.. ఐకాన్ స్టార్ తన కథల ఎంపిక ప్రత్యేకం.. వేసే డ్రెస్సులు ప్రత్యేకం.. బన్నీ డ్యాన్స్ ప్రత్యేకం.. అందుకే ఈ సినిమా తర్వాత బన్నీని ఐకాన్ స్టార్ లేదా పుష్ప అని పిలుస్తారు” అంటూ సుకుమార్ అన్నారు.
previous post