telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

హైపర్ ఆదికి తలనొప్పిగా మారిన దొరబాబు యవ్వారం

aadi

వైజాగ్ లోని మాధవ దారలోని వ్యభిచార గృహంపై పోలీసులు జరిపిన దాడుల్లో జబర్దస్త్‌ కామెడీ షో నటులు దొరబాబు, పరదేశి పట్టుబడిన విషయం తెలిసిందే. వీరిద్దరు హైపర్ ఆది టీమ్‌లో స్కిట్స్ చేయడంతో పాపులర్ అయ్యారు. కెరీర్ స్టార్టింగులో ఆ టైపు వీడియోల్లో నటించడంతో అమ్మాయిల పిచ్చి ఉన్న వాడిగా దొరబాబుపై జడ్జిలతో సహా పార్టిసిపెంట్స్ అందరూ సెటైర్లు వేసేవారు. నిజానికి అతడి దురలవాట్ల గురించి హైపర్ ఆదికి తెలిసే ఉంటుందని వార్తలు వస్తున్నాయి. అందుకు తగ్గట్లే హైపర్ ఆది అతడిపై సెటైర్లు వేసేవాడు. కానీ దొరబాబు నిజజీవితంలో కూడా అలాంటి వాడే అని తేలింది. అయితే ఈ వ్యవహారం తర్వాత కూడా దొరబాబు జబర్దస్త్ లో కొనసాగాడు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ ఎఫెక్ట్ తో జబర్దస్త్ షూటింగులు ఆగిపోయాయి. అయితే హైపర్ ఆదికి మాత్రం ప్రొడక్షన్ టీమ్ నుంచి ఒత్తిడి స్టార్ట్ అయినట్లు సమాచారం అందుతోంది. లాక్ డౌన్ కారణంగా అడ్వర్టయిజ్ మెంట్స్ ఆదాయం తగ్గే అవకాశం ఉందని, అందుకే కొంత కాలం పాటు కొద్ది మంది ఆర్టిస్టులతోనే జబర్దస్త్ నడిపించాలని టీమ్ లీడర్లకు చెప్పినట్లు సమాచారం. అయితే హైపర్ ఆది టీమ్ లో దొరబాబును ఉంచాలా వద్దా అనే నిర్ణయం తీసుకోవాల్సిందిగా అతడికి తెలిపారు. దీంతో హైపర్ ఆది ఎలాంటి డిసెషన్ తీస్కుంటాడా అని అంతా వెయిట్ చేస్తున్నారు.

Related posts