telugu navyamedia
సినిమా వార్తలు

బేబీ లుక్స్ తో అదరగొడుతున్న సమంత

Samantha

సమంత అక్కినేని కొండాపూర్‌లో బేబీ లుక్‌లో సందడి చేశారు. కొండాపూర్‌లో ఓ షాపింగ్ మాల్‌లో జరిగిన ‘ఒప్పొ’ మొబైల్ స్టోర్ ప్రారంభోత్సవంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె డ్రెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పూల డిజైన్‌తో ఉన్న పసుపు రంగు ఫ్రాక్‌లో సామ్ మెరిసిపోయారు. ఈ ఫోటోలు చూసిన వారు పెళ్లి తర్వాత సమంత మరింత నాజూకుగా తయారయ్యింది అంటూ కితాబిస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో సమంతతో సెల్ఫీల కోసం అభిమానులు పెద్ద ఎత్తున ఎగబడటంతో కాస్త గందరగోళం ఏర్పడింది. అయితే బౌన్సర్ల అండతో ఆమె సురక్షితంగా బయటపడ్డారు. స‌మంత, నాగ‌శౌర్య ప్ర‌ధాన పాత్ర‌లలో నటించిన ‘ఓ బేబీ’ విడుదలకు సిద్ధమవుతోంది. సీనియర్ నటి ల‌క్ష్మీ, రావు ర‌మేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మిక్కి జె.మేయ‌ర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, గురు ఫిలింస్‌, క్రాస్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్ నిర్మిస్తున్నాయి. నందినీ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం జూలై 5న విడుదల కానున్నట్టు సమాచారం.

Related posts