telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

పాములాంటి లెగ్గిన్ వేసిన భార్య… కాళ్ళు విరగ్గొట్టిన భర్త

snake stockings

ప్రస్తుతం ఫ్యాషన్ వెర్రితలలు వేస్తుందనడానికి ఇప్పుడు జరిగిన ఘటనే నిదర్శనం. పామును పోలిన లెగ్గిన్స్ వేసుకున్న భార్య కాళ్ళను చూసిన భర్త… అవి నిజంగానే పాములు అనుకొని భార్య కాళ్ళను చితకబాదాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగింది. మెల్‌బోర్న్‌లో నివసించే ఓ మహిళ షాపింగ్ కోసం షాపింగ్ మాల్ కు వెళ్ళింది. అక్కడ మార్కెట్‌లోకి కొత్తగా పాము డిజైన్ తో వచ్చిన లెగ్గిన్స్‌ ఆకర్షణీయంగా ఉండడంతో మనసుపారేసుకుంది. వెంటనే వాటిని కొనుక్కుంది.

ఆ తరువాత భర్తను ఆటపట్టించాలన్న ఉద్దేశ్యంతో నిద్రపోయే ముందు వాటిని ధరించింది ఆ యువతి. నిద్రపోవడానికి గదిలోకి వచ్చిన ఆమె భర్త… భార్య ధరించిన లెగ్గిన్ ను చూసి… నిజంగానే పాములు అనుకుని భయపడిపోయాడు. వెంటనే ఇంట్లో ఉన్న బేస్‌బాల్ బ్యాట్ అందుకుని బలంగా వాటిపై కొట్టాడు. ఆ దెబ్బకు భార్య కెవ్వుమంటూ కేకలు వేయగా… ఆమె కూడా పాముల్ని చూసే భయపడుతుందేమో అనుకుని… బలంగా ఇంకో దెబ్బ వేశాడు. అయితే ఈసారి విలవిల్లాడిపోతున్న భార్యను చూసి అసలు విషయం తెలుసుకున్నాడు. నొప్పిని తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె కాళ్ళను పరీక్షించిన వైద్యులు ఎముకలు విరిగాయని చెప్పారు. అందుకే ఇలాంటి పిచ్చి పనులు చేసేముందు ఓసారి ఆలోచించండి. ఎదుటివారిని ఆటపట్టించేది ఏమో కానీ… ఇలా ఎవరు తవ్వుకున్న గోతిలో వారే పడే ప్రమాదం ఉంది.

Related posts