telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ప్రకాశం, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

monsoon in chennai 5days rains

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ప్రకాశం, అనంతపురం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. సాధారణంగా జూలై 15 నాటికే నైరుతి ప్రభావం అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది. ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యమైందని వాతవరణ శాఖ తెలిపింది.

ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలకు పర్చూరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేటపాలెం, చినగంజాంలో వర్షపునీరు ఇళ్లలోకి చేరింది. చీరాలలో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. యద్దనపూడి మండలం యనమదలలో ఉప్పువాగు పొంగి పొర్లుతోంది. యనమదలలో కాలనీలోకి వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు.

అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురిసింది. జెండా వీధి, సీపీఐ కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరడంతో కాలనీ వాసులు రాత్రంతా జాగారం చేయాల్సి వచ్చింది. గుత్తి పట్టణంలో పలు చోట్ల డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్థంగా ఉండటంతో మురుగునీరు రోడ్డుపైకి వచ్చి అనంతరం ఇళ్లలోకి చేరింది. వర్షానికి తోడు ఉరుములు,మెరుపులు తోడవ్వడంతో అధికారులు ముందుజాగ్రత్తగా విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

Related posts