ఇటీవల కాలంలో కొన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారమవుతున్న రియాలిటీ డ్యాన్స్ షోలలో అసభ్యత ఎక్కువగా ఉంటోంది. కుటుంబమంతా కూర్చొని చిన్నపిల్లలతో కలిసి చూసే ఇలాంటి షోలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రియాల్టీ డ్యాన్స్ షోలతో పాటు ఇతర కార్యక్రమాల్లో పిల్లల్ని అనుచితంగా చూపించరాదని, సినిమాల్లో పెద్దలు చేసే డ్యాన్స్ స్టెప్పులను పిల్లలతో వేయిస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వశాఖ ప్రైవేటు టీవీ ఛానళ్లను హెచ్చరించింది. పెద్దలు వేసే స్టెప్పులు చిన్న పిల్లలతో చేయించడం వల్ల వారిపై తీవ్ర ప్రభావం ఉంటుందని, పిల్లల ప్రోగ్రాముల్లో ఎటువంటి హానికరమైన భాష కానీ, హింసాత్మక సన్నివేశాలను కానీ చూపించరాదని, కేబుల్ చట్టం ప్రకారం అన్ని ప్రైవేటు ఛానళ్లు ఈ నిబంధన పాటించాలని పేర్కొంది సమాచార శాఖ.
previous post