telugu navyamedia
ఆరోగ్యం

వేడి వేడి టీ తాగుతున్నారా ?… అయితే జాగ్రత్త

Hot-Tea
సాధారణంగా చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే అందులో కొంతమందికి మాత్రం వేడివేడి టీ తాగకపోతే రోజు గడవదు. కానీ వేడివేడి టీ తాగేవారి ఆరోగ్యం జాగ్రత్త అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇలా వేడి వేడి టీ తాగడం వలన దీర్ఘకాలంలో జీర్ణాశయ కేన్సర్‌ బారిన పడే ప్రమాదముందనే విషయం ఇటీవల నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది. నలభై నుంచి 75సంవత్సరాల వయస్సుకల 50 వేల మంది మీద సుమారు పది సంవత్సరాల పాటు జరిగిన అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైంది. వీరిలో సగం మందికి పైగా వేడి టీతాగే అలవాటుంది. అధ్యయనకాలం ముగిసే నాటికి వీరిలో రెండు వందల మంది జీర్ణాశయ కేన్సర్‌ బారిన పడినట్టు గుర్తించారు విశ్లేషకులు. 60 సెంటీగ్రేడ్‌ వద్ద మరిగించిన టీని రోజుకు 750 ఎంఎల్‌ తాగితే కేన్సర్‌ వచ్చే అవకాశాలు 20 శాతమున్నాయని, టీతాగే అలవాటున్నవారు రూమ్‌ టెంపరేచర్‌ వద్ద చల్లార్చిన టీని మాత్రమే తాగాలని సూచిస్తున్నారు.

Related posts