ప్రకృతి ప్రకోపానికి గురవుతుంది ఇరాన్. తాజాగా, ఆ దేశంలో సంభవించిన వరదలతో 76 మంది మృత్యువాత పడగా, వందలాది మంది గాయాల పాలయ్యారు. ఇరాన్ దేశంలోని ఫార్స్, హార్మోజోగన్, సిస్టాన్, బలుచిస్థాన్, ఖోరసాన్ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలతో వరదలు వెల్లువెత్తాయి.
ఈ వరదల్లో 76 మంది మరణించారని ఇరాన్ అధికారి అహద్ వాజిపేహ్ వెల్లడించారు. ఇరాన్ లోని 25 రాష్ట్రాల్లో సంభవించిన వరదలతో వేలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. దీని తో పలు కుటుంబాలు నిరాశ్రయులుగా మిగిలాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇరాన్ అధికారులు వరద సహాయ పనులు చేపట్టారు.
10 వారాల పాటు హౌస్ లోనే గంగవ్వ… కౌశల్ ఆసక్తికర వ్యాఖ్యలు