telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఈసారి ప్రపంచ కప్ లో .. పాక్ సెమీఫైనల్స్ కి వస్తుంది.. : గంగూలీ 

ganguly on icc world cup finals

మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వరల్డ్ కప్ క్రికెట్ పోటీల్లో సెమీఫైనల్స్ కు పాకిస్థాన్ చేరే అవకాశాలున్నాయని అంచనా వేశారు. ఇండియాతో పాటు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, పాకిస్థాన్ జట్లు సెమీస్ కు చేరుతాయని భావిస్తున్నానని, ఈ జట్లలో ఒకరికి కప్ దక్కుతుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో జరిగిన పోటీలతో పోలిస్తే, ఈ సారి మరింత కఠినంగా పోరు సాగుతుందని వ్యాఖ్యానించిన ఆయన, భారత జట్టు అన్ని రంగాల్లోనూ బలంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు.

సులభంగా భావించే జట్లేవీ లేవని, ఏ జట్టుపైన అయినా విజయం కోసం చెమటోడ్చాల్సిందేనని అన్నారు. ఈ దఫా వరల్డ్ కప్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో సాగనుందన్న సంగతి తెలిసిందే. ప్రతి జట్టూ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడతాయి. టాప్ 4 స్థానాల్లో నిలిచే జట్లు సెమీస్ కు చేరుతాయి.

Related posts