telugu navyamedia
sports trending

ఐపీఎల్ సందడి : ఢిల్లీ క్యాపిటల్స్ కి .. సలహాదారుడిగా గంగూలీ..

ganguly as ipl delhi team advisor

టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ఈ ఐపీఎల్‌ సీజన్‌ కు ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సలహాదారుగా నియమితులయ్యారు. ఈ మేరకు జట్టు యాజమాన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో పనిచేయనున్నందుకు సంతోషంగా ఉంది. జిందాల్, జేఎస్‌డబ్ల్యూ సంస్థల గురించి చాలా ఏళ్లుగా తెలుసు. వారి క్రీడా ప్రస్థానంలో కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది’ అని గంగూలీ అన్నాడు.

గంగూలీ అనుభవం, సలహాలు, సూచనలు, జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. ఆయన నాకు కుటుంబ సభ్యుడితో సమానం. గంగూలీ తమ జట్టుకు సలహాదారుగా ఉండడం ఆనందంగా ఉందని’ అని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు ఛైర్మన్‌ పార్థ్‌ జిందాల్ వ్యాఖ్యానించారు. ఆ జట్టు కోచ్‌ రికీ పాంటింగ్‌తో కలిసి గంగూలీ పనిచేయనున్నారు. ఢిల్లీ జట్టు ఇంతవరకు ఒక్క ఐపీఎల్‌ సీజన్‌లోనూ ట్రోఫీని చేజక్కించుకోలేదు.

మార్చి 24న ముంబై ఇండియన్స్‌తో, ఢిల్లీ క్యాపిటల్స్‌ తన తొలి మ్యాచ్‌ ఆడనుంది.

Related posts

“అసురన్”గా మారిన ధనుష్

vimala p

శబరిమలలో.. దారుణం.. మహిళలకు దర్శనం చేయించిన అధికారులు.. బోరుమంటున్న భక్తులు..

vimala p

కాంగ్రెస్ .. ‘హస్త’మేనిఫెస్టో .. ముఖ్యంశాలు ..

vimala p