telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

క్యాబ్ డ్రైవర్ చేతివాటం.. డ్రాప్ చేశాడు .. దోచుకున్నాడు.. క్యా ఐడియా బాపు.. !!

mobile phone theft in telangana

కృతజ్ఞత, మానవత్వం రానురాను కనుమరుగవుతున్నాయి.. దానికి కారణం ఎంత సంపాదించినా ఆశ తీరకపోవడం.. అంటే తమది అత్యాశ అని ఎవరు మాత్రం ఒప్పుకుంటారు. అయితే అది వాళ్లకు కష్టాలు తెచ్చిపెడితే అప్పుడు ఆలోచనలో పడి అర్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ క్యాబ్ డ్రైవర్ కి అదే జరిగింది. అమెరికాలో ఓ క్యాబ్ డ్రైవర్ తాను ఎయిర్ పోర్టులో డ్రాప్ చేసిన దంపతుల ఇంటికే కన్నం వేశాడు. కాలిఫోర్నియాలో జరిగిందీ ఘటన. ఎయిర్ పోర్టుకు వెళ్లడానికి భార్యాభర్తలు ఉబెర్ క్యాబ్ బుక్ చేసుకున్నారు. ఆ క్యాబ్ కు జాకీ గోర్డాన్ విల్సన్ అనే వ్యక్తి డ్రైవర్ గా వ్యవహరిస్తున్నాడు. ఎంతో నమ్మకంగా ఇంటికి వచ్చి ఆ దంపతులను ఎక్కించుకుని విమానాశ్రయానికి చేర్చాడు. అనంతరం నేరుగా తాను ఎక్కడ వాళ్లను ఎక్కించుకున్నాడో అక్కడికే వచ్చాడు. తనను ఎవరూ గమనించడంలేదు అనుకుని ఆ దంపతులు ఇంట్లో ప్రవేశించాడు. ఆ భార్యభర్తల ఇంటికి ఉన్న సీసీటీవీ కెమెరాలో అతడి కదలికలు రికార్డయ్యాయి.

ఆ కాలనీ వాసులు గ్రూప్ సెక్యూరిటీ సిస్టమ్ ఉపయోగిస్తుండడంతో, ఎవరింటి పరిసరాల్లో అయినా అనుమానాస్పద కదలికలు ఉంటే ఆ వీడియో ఫుటేజ్ అందరికీ వెళుతుంది. ఈ క్రమంలో అలారం మోగడంతో ఆ డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేయడంతోపాటు, ఆ దంపతలకు కూడా చెప్పారు. వాళ్లు వచ్చి ఇంట్లో కొన్ని వస్తువులు చోరీకి గురైనట్టు తెలుసుకున్నారు. ఇరుగుపొరుగు వారు చూపించిన వీడియో చూసి ఆశ్చర్యపోయారు. తమను ఎయిర్ పోర్టుకు తీసుకెళ్లిన ఉబెర్ క్యాబ్ డ్రైవరే దొంగ అవతారం ఎత్తాడని గుర్తించారు. పోలీసులు జాకీ గోర్డాన్ విల్సన్ ను అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు.

Related posts